ED Raids: ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం.. నిధులు పక్కదారి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి.. 27 గంటలపాటు సోదాలు, విచారణ సాగింది.. ఈడీ రైడ్స్‌లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు.. మూడు బ్యాగుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారు అధికాలరు.. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో జరిపిన సోదాల్లో కీలక ఆధారాలను రాబట్టింది ఈడీ.. నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆర్ధిక లావాదేవీల వివరాలను డాక్యుమెంట్లతో సహా స్వాధీనం చేసుకున్నారు.. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి సుమారు రూ. 25 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టినట్టు ఈడీ గుర్తించింది.. ఎంబీబీఎస్, పీజీ సీట్ల ఫీజుల్లో నుంచి నిధులను కొందరు డైరెక్టర్లు మళ్లించినట్టు ఈడీకి ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది.. ఇక, భవనాల నిర్మాణం పేరుతో రూ. 4 కోట్ల మేర నిధులు మళ్లించారని తేల్చారు..
Read Also: NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం , ఫ్రీచార్జ్ వాడుతున్నారా? అయితే మీకు ఊరట..
Also Read
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
పలువురు ఎన్ఆర్ఐలు పన్ను రాయితీల కోసం విదేశాల్లో ఇచ్చిన విరాళాలను ఇక్కడ కొందరు డైరెక్టర్లు డ్రా చేసుకున్నట్టు ఈడీ సోదాల్లో గుర్తించారు.. రికార్డుల్లోకి కోవిడ్ పేషంట్ల వివరాలు పోందుపర్చకుండా నిధులను మళ్లించారన్న అంశంపై ఈడీ పక్కా ఆధారాలు చిక్కాయి.. 1500కు పైగా రోగుల నుంచి రూ.30 కోట్లకు నగదు పక్కదారి పట్టినట్టు తేల్చారు.. ఈడీ సోదాల్లో కొందరు డైరెక్టర్ల తెర వెనుక బినామీ బాగోతాలు కూడా వెలుగుచూశాయి.. ఓ డైరెక్టరుకు బినామిలుగా ఎస్సీ, ఎస్టీలు ఉన్నారట.. దళితుల పేర్లతో అప్పులు తీసుకున్నారట సదురు డైరెక్టర్… తీసుకున్న రుణంతో గిడ్డంగులు నిర్మించారని సమాచారం. సుమారు రూ. 40 కోట్ల మేర అప్పులు తిరిగి చెల్లించలేదని ఈడీ సోదాల్లో బినామీ బాగోతం బయటపడింది.. ఈ వ్యవహరం అంతా ఓ బినామీ కంపెనీ పేరుతో లావాదేవీలు జరిపినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.. మాన్యువల్, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.. కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషంట్ల వివరాలు రికార్డుల్లో చేర్చలేదని ఈడీ గుర్తించింది. అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ నిధులతో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ వైద్య పరికరాలు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇక, స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తే.. మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెబుతున్నారు ఈడీ అధికారులు.
తాజావార్తలు
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!