బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా.. బీసీ మంత్రులు, నేతలు కీలక సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా మీడియతో మాట్లాడిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.. విజయవాడలో డిసెంబర్ 8న భారీ ఎత్తున బీసీ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం హాజరయ్యే అవకాశం ఉందన్నారు.. ఇక, బీసీల గురించి ఎన్నికల ముందు నుంచే ఆలోచించిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. బీసీ వర్గాల జీవన విధానంలో మార్పులు తీసుకుని రావటానికి జగన్ ఒక డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి.. 139 బీసీ కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చి సంక్షేమ ఫలాలను అందించారన్న ఆయన.. కాలానుగుణంగా వచ్చే మార్పులను బట్టి ఇంకా ఏం చేయాలన్న అంశాలపై అధ్యయనం చేస్తాం అన్నారు.
Read Also: RK Roja: తిరుమల టు శ్రీశైలం పాదయాత్ర.. జగనన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం..
ఇక, దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటే బీసీల రాష్ట్రం అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. 8వ తేదీన విజయవాడలో బీసీల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.. గ్రామ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు ఈ సదస్సులో పాల్గొంటారు.. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలన్న మేధోమథనం చేస్తామని.. ముఖ్యమంత్రిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు.. మా అందరికీ దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రిని కోరతాం.. మూడున్నర ఏళ్లలో బీసీ వర్గాలకు సుమారు 88 వేల కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని గుర్తుచేశారు.. చంద్రబాబు 500 కోట్ల అయినా ఖర్చు పెట్టారా? అని నిలదీసిన ఆయన.. విజయవాడలో 10 వేల మంది ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించాం.. మేం చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు మంత్రి జయరాం.
ఇక, ఎన్టీవీతో రాజమండ్రి ఎంపీ ఎమ్పీ మార్గాని భరత్.. బీసీలకు మేం చేశామని చెబుతున్న లెక్కలు మేం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. అంతా ముఖ్యమంత్రి ఒక బటన్ నొక్కగానే వారి ఖాతాల్లో జమ అవుతున్నాయన్న ఆయన.. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారు? అని నిలదీశారు. తొకలు కత్తిరిస్తాం అని చంద్రబాబు అహంభావం ప్రదర్శించిన విషయాన్ని బీసీ వర్గాలు మర్చిపోవన్నారు.. 75 ఏళ్ళ భారత స్వాతంత్ర్య చరిత్రలో రాజమండ్రి ఎంపీ సీటును జగన్ మొదటి సారి ఒక బీసీకి ఇచ్చారు.. దీనికి నేనే ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు. బీసీ వర్గాలకు మరింత మేలు ఏం చేయాలన్న అంశంపై కసరత్తు చేస్తామన్నారు.
ఎన్టీవీతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ మాట్లడుతూ.. టీడీపీ బీసీలకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తాం అన్నారు.. ఈ ప్రభుత్వం బీసీల ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా పెంచింది అనేది వివరిస్తాం.. వైసీపీ బీసీల పార్టీ.. బీసీ వర్గాలన్నీ వైసీపీకి మాకు మద్దతుగా నిలబడటంతోనే చంద్రబాబు 23 స్థానాలకు పరిమితం అయ్యారన్నారు.. బీసీ కుటుంబాలకు జరిగిన మేలు, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం పై ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది.. వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని నెత్తిన మోస్తాయన్నారు.. బీసీ విద్యార్థులకు చంద్రబాబు 1995లో కూడా ఏమీ చేయకపోవటం వల్లే సాఫ్ట్‌వేర్ బూమ్‌లో అవకాశాలు చేజిక్కించుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్.