ఈమధ్యకాలంలో వివాహితలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. కోటి ఆశలతో అత్తింట అడుగు పెట్టిన వారికి కష్టాలే స్వాగతం పలుకుతున్నాయి. విజయవాడలో అత్తవారింటి వేధింపులకు ఓ వివాహిత అష్టకష్టాలు పడుతోంది. 8 నెలలుగా మంచానికే పరిమితం అయిందా మహిళ. పెళ్ళి అయిన నాటినుంచి ఆమె సంసారం నిస్సారంగా, కష్టాల సాగరంగా సాగుతోంది. 8నెలల క్రితం వినుకొండకు చెందిన షేక్ షేక్సవలి తో కంసలిపేటకు చెందిన షేక్ మీరాబికు వివాహం అయింది. వివాహం అయిన నాటి నుంచి వేధింపులు మొదలుపెట్టాడు భర్త షేక్సవలీ.
Read Also: Kola Balakrishna: క్రైమ్ థ్రిల్లర్ గా ‘నేనెవరు’!
కట్నం తీసుకురాకుంటే నాలో సైతాన్ ప్రవేశించి నిన్ను చంపేస్తాడు అంటూ బెదిరింపులకు పాల్పడ్డ భర్త షేక్సవలీ నానా ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇంట్లో చెప్తే మీ కుటుంబ సభ్యులకు చేతబడి చేయిస్తానంటూ బెదిరించడంతో షేక్ మీరాబి మిన్నకుండిపోయింది. బెదిరింపులు అలాగే కొనసాగాయి. ఇబ్బందులు తాళలేక వినుకొండ నుంచి పారిపోయి వచ్చేసింది షేక్ మీరాబి. ఇనుప రాడ్లతో రెండు కాళ్ళ తుంటి వద్ద తీవ్రంగా గాయపర్చాడు భర్త. దీంతో రెండు కాళ్ళు కోల్పోయి మంచానికే పరిమితమైంది షేక్ మీరాబి. తన పట్ల భర్త, అత్తింటి వారు వ్యవహరించిన తీరుపై షేక్ మీరాబి ఆవేదన చెందుతోంది. విజయవాడ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోలేదని షేక్ మీరాబి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కట్నం కోసం నానా ఇక్కట్లు పెడుతున్న ఇలాంటి కసాయి భర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: Unstoppable 2: అన్ స్టాపబుల్ ఎపిసోడ్-4… బాలయ్య స్నేహం, రాజకీయబంధం