బీసీల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బీసీలు ఉన్నారని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జయహో బీసీ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక సాధికారతలో భాగంగా డీబీటీ, నాన్- డీబీటీల ద్వారా సంక్షేమం అందించాం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు 3,19,000 లక్షల కోట్లు సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అందించాం.. దీనిలో 2,50,358 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాల కోసమే ఖర్చు చేశాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. అంటే 80 శాతం పేద, సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశామన్న ఆయన.. 2018-19 బడ్జెట్, ఇప్పటి బడ్జెట్ ఒకటే.. అప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం అయితే.. ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 15 శాతం అని.. మరి ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు అని ప్రశ్నించారు.. అప్పుడు బడ్జెట్ అంతా నలుగురి జేబుల్లోకి వెళ్ళేది.. దోచుకో, పంచుకో, తినుకో పథకం అని ఫైర్ అయ్యారు.. అప్పుడు చంద్రబాబు బీసీ కులాల తోకలు కత్తిరిస్తా అన్నాడు.. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అనేవాడని విమర్శించారు. ఇవాళ బడ్జెట్‌లోనే కాదు నా గుండెల్లో సామాజిక కులాలకు చోటు కల్పించాం.. పాదయాత్రలో బీసీల ఆకాంక్షలను తెలుసుకున్నాన్నారు..
Read Also: CM YS Jagan at Jayaho BC Maha Sabha: మాటలతో కాదు.. చేతుల్లోనే ఒక విప్లవం తీసుకొచ్చాం..
ఇక, నాగరికతకు పట్టుకోమ్మ లు బీసీలు అని స్పష్టం చేశారు సీఎం జగన్.. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్‌లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు.. జయహో బీసీ మహాసభలో స్వాగతం పలికారు.. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నె ముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈమూడున్న రేళ్ల కాలంలో తమ ప్రభుత్వం వేసిందని స్పష్టం చేశారు.. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమగా అభివర్ణించిన ఆయన.. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నత చరిత్ర బీసీలకు ఉందన్నారు.. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని పేర్కొన్న ఆయన.. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నె ముక కులాలు చేస్తానని చెప్పాం.. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వా ముల్ని చేశానని గుర్తుచేసుకున్నారు.. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చాను.. ఇప్పుడు వారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..