బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో బీసీలకు భారీగా అవకాశాలు కల్పించారు.. కిందిస్థాయిలో కూడా బీసీలకు పెద్దపీఠవేశారు.. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల ప్రజలను ఏం చేశామని చెప్పేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైసీపీ నిర్వ హించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని సీఎం జగన్.. తన మూడున్న రేళ్ల పాలనలో చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నా రు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూర్చాన మంత్రలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట.. ఇక, ‘జయహో బీసీ’ మహాసభ వేదికగా తాము బీసీల కోసం తెచ్చిన పథకాలు, వాళ్లకు కల్పించిన ప్రాధాన్యత అన్ని చెప్పుకురానున్నారు..
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఇవాళ ఉదయం 10 గంటలకు జయహో బీసీ మహాసభ ప్రారంభంకానుంది.. ఈ మహాసభలో వైఎస్సా ర్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. తాను సీఎం అయిన తర్వాత బీసీలకు చేస్తున్న మేలుతో పాటు.. రానున్న రోజుల్లోకలిగించబోయే ప్రయోజనాలను వివరించబోతున్నారు.. ఈ మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలికింది.. వారికి పేరుపేరునా ఆహ్వాన పత్రికలను పంపించింది.. ‘జయహో బీసీ’ మహాసభ.. వెనుకబడిన వర్గాలే వెన్నె ముక నినాదంతో నిర్వ హిస్తున్న ఈ మహాసభకు 82 వేలకు పైగా ప్రతినిధులతో పాటు.. లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనావేస్తున్నారు.. ఇక, జయహో బీసీ మహాసభ కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది.. సభా ప్రాంగణం వద్ద ఏర్పా టు చేసిన జ్యోతీరావు పూలే, సీఎం వైఎస్ జగన్‌ల భారీ కటౌట్లు ఏర్పాటుచేశారు..
ట్రాఫిక్ ఆంక్షలు..
* నగరంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభలను దృష్టిలో ఉంచుకుని బుధవారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాతీయ రహదారులపై భారీ వాహనాలను దారి మళ్లిస్తారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే భారీ వాహనాలను జి కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
* విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే భారీ వాహనాలను గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు.
* గుంటూరు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.
* విశాఖపట్నం నుండి వచ్చే APSRTC బస్సులు రామవరప్పాడు రింగ్, మహానాడు, నోవాటెల్, బెంజ్ సర్కిల్, కృష్ణలంక మరియు PNBS మీదుగా మళ్లించబడతాయి.
* ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంజీ రోడ్డులో వాహనాలను అనుమతించరు.
* మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లకు పార్కింగ్ స్థలం సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్, శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే బస్సుల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి వచ్చే బస్సుల్లో ఆంధ్రా లయోలా కాలేజీ గ్రౌండ్స్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో పార్కింగ్ చేయాలి సిద్ధార్థ. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ, కడప, నంద్యాల జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే ప్రభుత్వ పాఠశాల మైదానం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చే అభ్యర్థులు సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో పార్కింగ్ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జాతీయ రహదారులపై భారీ వాహనాలను సభ కోసం మళ్లిస్తారు మరియు పాల్గొనేవారికి వాహనాల పార్కింగ్ కోసం వివిధ ప్రాంతాలను కేటాయించారు.