బోండా ఉమా, దేవినేని అవినాష్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రంగా చనిపోయిన సమయంలో దేవినేని నెహ్రూ దగ్గరే ఉన్నాడన్నారు బోండా ఉమా. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలో కొడాలి ఉన్నాడని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి ఎవరని ప్రశ్నించారు బోండా ఉమా. అయితే, బోండా ఉమా ఓ చిల్లర వ్యక్తని, బజారు మనిషని మండిపడ్డారు దేవినేని అవినాష్. బోండా…
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు చర్యలు చేపట్టింది.. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది.. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్ప్లాన్ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే…
అఖిలపక్ష సమావేశం ముగిసింది.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.. వివిధ తీర్మానాలు చేసింది అఖిలపక్ష సమావేశం. జగన్ ప్రభుత్వ హింసాత్మక చర్యలపై సీజేఐను కలిసి వినతిపత్రం ఇవ్వాలని, రాష్ట్రస్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల స్థాయిలో పరిరక్షణ వేదిక కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ అణిచివేతకు గురైన వారికి వేదిక అండగా ఉండాలని, ప్రభుత్వ విధానాలపై పరిరక్ష వేదిక పనిచేయాలని తీర్మానించారు. ఇక, వైఎస్ జగన్ హయాంలో…
Ayesha Meera Mother: విజయవాడలో అయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఇంకెన్నాళ్లు’ పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయేషా మీరా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ.. అయేషా హత్యకు గురై 15 ఏళ్లు అయ్యిందని.. ఐపీఎస్ అధికారి ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. సత్యం బాబును అరెస్టు చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదన్నారు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ…
Kodali Nani: విజయవాడలో నున్న సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వంగవీటి రాధా పాల్గొన్నారు. వీళ్ల ముగ్గురూ ఒకే వేదికపైకి రావడంతో రాజకీయంగా ఆసక్తి రేగింది. ఈ సందర్భంగా వంగవీటి రంగాపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసమే రంగా జీవించారని.. నమ్మిన సిద్దాంతం కోసం రంగా ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజల గుండెల్లో రంగా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారని కొడాలి…
ఎక్కడైనా వినియోగదారులను మోసం చేస్తే కఠిన శిక్షలు, భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వినియోగదారుడు మోసపోయిన ప్రాంతానికే వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. కానీ, ఇప్పుడు ఎక్కడి…