బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో బీసీలకు భారీగా అవకాశాలు కల్పించారు.. కిందిస్థాయిలో కూడా బీసీలకు పెద్దపీఠవేశారు.. ఇక, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాల ప్రజలను ఏం చేశామని చెప్పేందుకు సిద్ధం అవుతోంది వైసీపీ.. దీనికోసం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం వేదికగా నేడు జయహో బీసీ మహాసభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైసీపీ నిర్వ హించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని సీఎం జగన్.. తన మూడున్న రేళ్ల పాలనలో చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నా రు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూర్చాన మంత్రలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట.. ఇక, ‘జయహో బీసీ’ మహాసభ వేదికగా తాము బీసీల కోసం తెచ్చిన పథకాలు, వాళ్లకు కల్పించిన ప్రాధాన్యత అన్ని వివరించబోతున్నారు..
నాగరికతకు పట్టుకోమ్మ లు బీసీలు అని స్పష్టం చేశారు సీఎం జగన్.. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్‌లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు.. జయహో బీసీ మహాసభలో స్వాగతం పలికారు.. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నె ముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈమూడున్న రేళ్ల కాలంలో తమ ప్రభుత్వం వేసిందని స్పష్టం చేశారు.. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమగా అభివర్ణించిన ఆయన.. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నత చరిత్ర బీసీలకు ఉందన్నారు.. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని పేర్కొన్న ఆయన.. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నె ముక కులాలు చేస్తానని చెప్పాం.. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వా ముల్ని చేశానని గుర్తుచేసుకున్నారు.. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చాను.. ఇప్పుడు వారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
బీసీల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బీసీలు ఉన్నారని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జయహో బీసీ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక సాధికారతలో భాగంగా డీబీటీ, నాన్- డీబీటీల ద్వారా సంక్షేమం అందించాం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు 3,19,000 లక్షల కోట్లు సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అందించాం.. దీనిలో 2,50,358 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాల కోసమే ఖర్చు చేశాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. అంటే 80 శాతం పేద, సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశామన్న ఆయన.. 2018-19 బడ్జెట్, ఇప్పటి బడ్జెట్ ఒకటే.. అప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం అయితే.. ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 15 శాతం అని.. మరి ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు అని ప్రశ్నించారు.. అప్పుడు బడ్జెట్ అంతా నలుగురి జేబుల్లోకి వెళ్ళేది.. దోచుకో, పంచుకో, తినుకో పథకం అని ఫైర్ అయ్యారు.. అప్పుడు చంద్రబాబు బీసీ కులాల తోకలు కత్తిరిస్తా అన్నాడు.. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అనేవాడని విమర్శించారు. ఇవాళ బడ్జెట్‌లోనే కాదు నా గుండెల్లో సామాజిక కులాలకు చోటు కల్పించాం.. పాదయాత్రలో బీసీల ఆకాంక్షలను తెలుసుకున్నాన్నారు..
జయహో బీసీ నినాదం తారక మంత్రం అయి రాష్ట్రం అంతా వినిపించాలి.. మన జాతి రత్నం జగన్ అన్నారు ఎంపీ మార్గాని భరత్.. వైసీపీ జయహో బీసీ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. చివరి అవకాశం అంటూ చంద్రబాబు మళ్ళీ మోసం చేయటానికి వస్తున్నాడు.. రాష్ట్రాన్ని పూత రేకులా మడత పెట్టి తినేస్తాడు.. మిడి మిడి జ్ఞానం ఉన్న లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టగలమా? పూటకో మాట మాట్లాడే ప్యాకేజీ స్టార్ ను నమ్మగలమా? దమ్మున్న మగాడు, దమ్మున్న మొనగాడు జగన్.. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేంత వరకు గళం ఎత్తుతాం అని ప్రకటించారు.
చరిత్ర తెలియని వాళ్ళు మా తోకలు కత్తిరిస్తారా? అంటూ వైసీపీ జయహో బీసీ మహాసభ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకృష్ణుడు యాదవ బీసీ, వాల్మీకి బోయ బీసీ, రాముడు గుహుడు జాలరి బీసీ, భీష్ముడు గంగా పుత్రుడు, చరిత్ర తెలియని వాళ్ళు మా తోకలు కత్తిరిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా? అని నిలదీసిన ఆయన.. బీసీల దెబ్బ ఏంటో చంద్రబాబుకు తెలుసు.. తోకలు కత్తిరిస్తాను అన్నందుకే చంద్రబాబు పిలక కత్తిరించి, గుండుకు సున్నం రాశారు.. అచ్చెన్నాయుడు నీ నాలుక తెగుతుంది.. నీ నాలుక చీలిక అవుతుంది.. వచ్చే ఎన్నికల్లో బీసీలు చరిత్ర తిరిగి రాయనున్నారన్నారు..
బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్... జయహో బీసీ మహాసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. గంజి పేదోడి పొట్టకి, మన బట్టకి అని చంద్రబాబు గతంలో చెప్పాడు.. ఇంత మంది బీసీలను చూసి చంద్రబాబు గుండె దడదడలాడతాయి అని సెటైర్లు వేశారు.. చంద్రబాబు బీసీలను కుల వృత్తుల వారీగానే చూశాడు.. బీసీలను తోలు తీస్తాం, తోకలు కత్తిరిస్తాం అన్నాడు.. బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి జగన్ మాత్రమే అన్నారు
బీసీలందరూ వేష, భాష మార్చాలంటూ పిలుపునిచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య.. జయహో బీసీ మహాసభ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సభలకు జోర్దార్ గా రావాలి.. పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు
మధ్యాహ్నం బీసీ మహాసభ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. 12 గంటల నుంచి ఒంటి గంట వరకు...గంట సేపు ముఖ్యమంత్రి జగన్ ఉపన్యాసం సాగనుంది.. నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైసీపీ అధినేత.. అన్ని జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన పార్టీ నేతలు.. ఇప్పటికే కిక్కిరిసిన సభా ప్రాంగణం
80 వేలకుపైగా మంది బీసీ నేతలకు ఆహ్వానం పంపింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వేదిక పై 182 మందికి చోటు కల్పించారు.. సభను ఉద్దేశించి బీసీ మంత్రులు, ఎంపీలు, అసెంబ్లీ స్పీకర్, పార్టీ బీసీ వింగ్ అధ్యక్షుడు, జిల్లాల బీసీల అధ్యక్షులు ప్రసంగించబోతున్నారు..
జయహో బీసీ మహాసభ ప్రారంభమైంది.. జ్యోతి ప్రజ్వలన చేశారు స్పీకర్ తమ్మినేని, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బొత్స, చెల్లుబోయిన వేణు, సిదిరి, కారుమూరి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. బీసీ వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటమే లక్ష్యంగా బీసీ మహాసభ నిర్వహిస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ