Dr BR Ambedkar Statue and Shruti vanam: బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి రెడీ..! 19నే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr BR Ambedkar Statue and Shruti vanam: విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, ఆయన విగ్రహ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.. అయితే, జనవరి 19న భారీ అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవానికి సన్నహాలు చేస్తున్నారు.. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు సమావేశం అయ్యింది వైసీపీ ఎస్సీ సెల్.. జనవరి 19న అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయాలని నిర్ణయించారు.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గ నేతలు హాజరు అయ్యే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.. మరోవైపు.. జనవరి 20వ తేదీన సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలని ప్రతిపాదనలు పెట్టారు.. ఈ సన్నాహక సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, తానేటి వనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు.
Read Also: CM Revanth Reddy: ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. హైదరాబాద్ రాగానే ప్రెస్ మీట్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని ప్రశంసలు కురిపించారు.. 68 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నారని గుర్తుచేశారు. కాగా, చారిత్రాత్మకమైన అంబేద్కర్ స్మృతివనం నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. సామాజిక న్యాయస్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచే ప్రాజెక్టు ఇది.. రాజ్యాంగ ఔన్నత్యం, ప్రజాస్వామ్య విలువలకు ప్రేరణగా నిలిచే గొప్ప కట్టడమని.. ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణాన్ని, సామరస్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు కీలకపాత్ర పోషిస్తుందని గతంలో ఈ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. నిర్ధేశించుకున్న గడువులోగా అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం పనులను పూర్తి చేయాలని.. స్మృతివనం, విగ్రహం ప్రారంభించేనాటికి ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే రిపబ్లిక్‌డే నాటికి పూర్తయ్యే విధంగా.. పనులు చేపడుతున్నామన్న సీఎంకు అధికారులు తెలిపారు.. జనవరి 15 నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు.. జనవరి 24న ప్రారంభోత్సవానికి అంబేద్కర్ విగ్రహం, స్మృతివనాన్ని సిద్ధం చేస్తామన్న గతంలో సీఎంకు అధికారులు చెప్పగా.. ఇప్పుడు అంతకంటే ముందుగానే జనవరి 19వ తేదీనే ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!