విజయవాడ: ఇంద్రకిలాద్రీ అమ్మవారి గుడిలో గురుభవానీల దీక్షా విరమణలకు అన్ని ఏర్పాట్టు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. బుధవారం జరిగిన పాలమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గుడిలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ‘ఈసారి 5 లక్షల పైగా భవానీ మాలధారులు దీక్ష విరమణకి ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం రూ.3 కోట్ల బడ్జెట్ భవానీ మాల విరమణలకు కేటాయిస్తున్నాం.
Also Read: AP High Court: ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టు విచారణ
దీక్షల విరమణలకు 300ల మంది గురుభవానీలు సిద్దం చేశామన్నారు. ఈ మేరకు 4 హోమగుండాలు , 20 లక్షల లడ్డూలు సిద్దంగా ఉంచామని చెప్పారు. భవానీ కోసం కేశఖండనశాలు, 800 షవర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి భవానీ భక్తుడి కోసం 20 గ్రాముల ఉచిత లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. వాష్ రూమ్స్, వాటర్ ప్యాకెట్స్ సిద్దం చేశామని, గిరి ప్రదక్షణ కోసం 14 కీలక పాయింట్లు ఏర్పాటు చేసి పేర్కొన్నారు. అలాగే అక్కడ ఎమర్జెన్సీ సేవలు అందిస్తామన్నారు. జనవరి 3 నుండి 7 వరకు దీక్ష విరమణ నేపథ్యంలో ఈ ఐదురోజులు భవానీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దీనికి వీఐపీలు సహకరించాలని కోరారు. దీక్షల విరమణ ఐదురోజులు అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
Also Read: Couple Sells Everything: క్రూయిజ్ షిష్‌లో ప్రపంచ పర్యటన.. ఆస్తులన్నీ అమ్మేసుకున్న జంట