YSRCP vs TDP: ఈసీ ఎదుట టీడీపీ-వైసీపీ పంచాయితీ.. పోటా పోటీ ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP vs TDP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ పోటీగా ఫిర్యాదులు చేశారు రెండు పార్టీల నేతలు.. ఇప్పుడు రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు వైసీపీ-టీడీపీ, జనసేన పార్టీల నేతలు.. దీంతో.. విజయవాడ వేదికగా ఎన్నికల కమిషన్ ముందు వైసీపీ-టీడీపీ పంచాయితీగా మారింది పరిస్థితి.. ఓట్ల తొలగింపు మీద పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు అధికార, విపక్ష నేతలు..
Read Also: Vivek Bindra Controversy: పేరుకు పెద్ద మోటివేషన్ స్పీకర్.. పెళ్లైన కొన్ని గంటలకే భార్యపై గృహ హింస
Also Read
విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను టీడీపీ, జనసేన నేతలు కలిశారు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య, బోండా ఉమా.. జనసేన నేతలు గాదె వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.. మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు నేతలు సీఈసీ ప్రతినిధులను కలిశారు.. రాష్టంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు. మరోవైపు.. వైసీపీ నేతలు కూడా సీఈసీని కలిశారు.. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, అబ్బయ్య చౌదరి తదితరులు ఎన్నికల అధికారులను కలిసిన వారిలో ఉన్నారు.. వారు కూడా ఓట్ల అక్రమాలపై సీఈసీకి ఫిర్యాదు చేశారు.
Read Also: Kannappa: న్యూజిల్యాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప.. మోహన్ బాబు ట్వీట్ వైరల్
కాగా, గతంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో 40.76 లక్షలకు పైగా దొంగ ఓట్లు జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు రాష్ట్రంలో కూడా నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, కక్ష పూరితంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు.. వైసీపీ నేతలే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ టీడీపీ కూడా పలు సందర్భాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!