ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటో ఓ మహిళా మరిచిపోయిన ఎనిమిది లక్షల విలువైన ఆభరణాలను బ్యాగ్‌ను తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నాడు. వివరాలు.. బెజవాడకు చెందిన ఈ ఆటో డ్రైవర్ పేరు పొలవరపు నాగేశ్వరరావు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడలోని తన బంధువుల పెళ్లికి వెళ్తున్న నవీన అనే వివాహిత నాగేశ్వరావు ఆటో ఎక్కింది. ఆమె చేతిలో నెలల చిన్నారి కూడా ఉంది. ఆటో ఎక్కిన అనంతరం…
ఇవాళ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పర్యటించారు. విజయవాడలోని ఓల్డ్ జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.
విజయవాడ: ఇంద్రకిలాద్రీ అమ్మవారి గుడిలో గురుభవానీల దీక్షా విరమణలకు అన్ని ఏర్పాట్టు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. బుధవారం జరిగిన పాలమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గుడిలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ‘ఈసారి 5 లక్షల పైగా భవానీ మాలధారులు దీక్ష విరమణకి ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం…
చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్.. ఆ ముగ్గురి మధ్య మూడు గంటల పాటు సాగిన చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి.. ఏపీలో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడులు వేస్తారు. పీకే.. టీడీపీతో కలిసి పనిచేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య ఓట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటీ పోటీగా ఫిర్యాదులు చేశారు రెండు పార్టీల నేతలు.. ఇప్పుడు రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి పోటీపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు వైసీపీ-టీడీపీ, జనసేన పార్టీల నేతలు.