భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విజయవాడ రూట్లో ప్రయాణించిన రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనాననంతరం చంద్రబాబు దంపతులకు పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదం అందించి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
పదేళ్లపాటు బెజవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున బెజవాడ ఎంపీగా వరుస విజయాలు సాధించారు కేశినేని నాని. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తరపున బరిలోకి దిగినా.. ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ పరాజయంతో తర్వాత అనేక సమాలోచనలు జరిపి చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకు న్నట్టు కేశినేని…
బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.
ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి ముందే పని ప్రారంభించి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పలు కీలక అంశాలపై సమాచారం అందుకున్న ఆయన, ప్రజాసంబంధాలు నిలబెట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీధిదీపాలు, నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలు, నగరాల్లో పరిస్థితులను మెరుగుపరచాలని సూచించారు. విజయవాడలో నీరు కలుషితమై మరణాలు సంభవించడంతో, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరలుకొరకు కింది వీడియో చుడండి.
విజయవాడలో వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాలుగు కార్లలో వంశీ ఇంటి వద్దకు వచ్చిన యువకులు.. ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. వంశీ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో గేట్లు పగులగొట్టే ప్రయత్నం చేశారు.
Nandamuri Ramakrishna Visits Kanaka Durga Temple: ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదల కానున్న నేపథ్యంలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుమారుడు నందమూరి రామకృష్ణ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించాలని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి, ప్రజలకు ఇకపై అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని ఆయన అమ్మవారిని ఆకాంక్షించారు. ఎన్నికల ఫలితాలు కూటమికి సానుకూలంగా రాబోతున్నాయని, ఇకపై ప్రజలకు…
విజయవాడలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ఏడుగురిని మరణించగా.. అధికారులు, పాలకుల అలసత్వంతో కలుషిత నీటి తాగుతూ అనేక మంది హస్పటల్ పాలవుతున్నారు.