AP Elections 2024: అధికారులందరి పాపాల చిట్టా బయటకి తీస్తాం.. ఎన్డీఏ ప్రభుత్వంలో బుద్ధిచెపుతాం అని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలపై దాడుల అంశంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారని మండిపడ్డారు. NCRB లిస్టు ప్రకారం 22 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారు.. వారిలో 6వేల మంది బాలికలున్నారు.. లక్షల లీటర్ల మద్యం ఏరులై పారుతోంది ఈ రాష్ట్రంలో.. రాత్రిపూట పోలీసు పేట్రోలింగ్ లేకుండా పోయింది.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి.. వైసీపీ నేతలపై లైంగిక వేధింపుల కేసులున్నాయి.. వైసీపీ మంత్రులే బూతులు మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు యామినీ..
Read Also: Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..
శాంతిభద్రతల సమస్యలు ఏపీలో నాయకుల వల్లే వస్తున్నాయని ఆరోపించారు జనసేన జనరల్ సెక్రెటరీ శివశంకర్.. విశాఖ, తిరుపతిలో గన్‌తో బెదిరించి ఆస్తి రాయించుకున్నారు.. విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు.. 2019 నుంచి క్రైం రేటు పెరగడానికి గంజాయి, డ్రగ్స్ కారణంగా చెప్పుకొచ్చారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే అని విమర్శించారు. వైసీపీ నేతల మీద కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు రిజిష్టర్ చేయకపోతే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. హిందూపూర్ లో రేప్ అండ్ మర్డర్ ను సూసైడ్ గా కేసు రిజిష్టర్ చేశారని మండిపడ్డారు. ఇండియన్ పీనల్ కోడ్ బదులు ఏపీ పొలిటికల్ కోడ్ రాష్ట్రంలో అమలవుతోందని ఆరోపించారు జనసేన జనరల్ సెక్రెటరీ శివశంకర్.