విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
అయితే, బెజవాడ మదరసా ట్రస్ట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక కరిష్మా అనే బాలిక మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ట్రస్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిన 100 కిలోల బీఫ్, మటన్ మాంసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డీప్ ఫ్రీజ్ లో గడ్డ కట్టిన మాంసం నిల్వలను ఇనుప గునపంతో పొడిచి శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. దుర్వాసన వస్తున్న కుళ్లిన మాంసం 15 రోజుల క్రితం నుంచి ఫ్రిజ్ లో ఉంచుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు తరలించారు. అనుమతులు లేని ట్రస్ట్ కి నోటీసులు జారీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు పర్వేజ్ మౌలాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.