కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. పోలీసుల విభాగంలోనూ పెద్ద ఎత్తున కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా పేరుపొందిన ఆయన.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఇవాళ ఆయన పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు.. కృష్ణ జిల్లా…
మాములు రోజుల్లో ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుంటున్న నేపథ్యంలో ఆంక్షలను అమలు చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నా, మరణాల రేటు పెరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా విజయవాడ, కడప జిల్లాల్లో పరిస్థితులు దారుణంగాఉన్నాయి . మాస్క్…
పక్కా ప్లాన్‌తో భార్యను హత్య చేశాడు భర్త. హత్యను మిస్ ఫైర్‌గా చిత్రీకరించబోయే అడ్డంగా దొరికిపోయాడు. బెజవాడ మిస్ ఫైర్ ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య రత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్న ప్రభ కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ ఘర్షణ సమయంలో వినోద్…
ఇవాళ విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ, జనసేన, సీపీఐ అందరూ చంద్రబాబు దొంగల ముఠా అని… బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ మొదటి సారి జీవితంలో నిజం మాట్లాడారని నిప్పులు చెరిగారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికే చోటు ఉంటుందని వాస్తవం చెప్పారని.. కానీ సాయంత్రానికి ప్యాకేజీ తీసుకుని గళం మార్చారని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టాలనుకుంటున్నారా? వాళ్ళు…
బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ దాడులు ఎవరికి షాక్ ఇచ్చాయి? పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు ఎవరికి మింగుడుపడటం లేదు? జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసహనం వ్యక్తం చేస్తున్న అమాత్యుల వారు ఎవరు? ఏసీబీ దాడులు.. మంత్రి శిబిరంలో కలకలం! దుర్గమ్మ చల్లని చూపు తమ మీద పడితే లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని భావిస్తారు బెజవాడ జనం. రాజకీయ నేతలు సైతం అదే ఆశిస్తారు. అలాంటి అమ్మవారి ఆలయాన్ని ఏసీబీ బృందాలు మూడు రోజులు జల్లెడ పట్టడంతో…
మార్చి 10 వ తేదీన రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. విజయవాడలో రైల్వేకు సంబంధించి ఆక్రమిత భూ బదలాయింపుకు సంబంధించి వైఎస్ జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాసారు. విజయవాడలోని రాజరాజేశ్వరి పేటలో 800 కుటుంబాలు రైల్వే స్థలాన్ని ఆక్రమించి 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాయి. పేదలు ఆక్రమించిన భూమి క్రమబద్దీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైల్వే శాఖకు ఉపయోగంలో లేని…