బెజవాడలో వ్యాక్సిన్ అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి… ప్రభుత్వ డాక్టర్ వ్యాక్సిన్ అమ్ముతున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేయాల్సిన వ్యాక్సిన్‌ను ఏకంగా అమ్మకానికి పెట్టి మరీ.. వ్యాక్సిన్ వేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.. వ్యాక్సిన్ కారులోనే వేస్తున్నట్టు సమాచారం అందటంతో జీ.కొండూరు ప్రభుత్వ డాక్టర్ ఎంఎస్ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అతని దగ్గర 5 కోవాగ్జిన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీసాలు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు.. ప్రస్తుతం కోవిడ్ హెల్ప్ లైన్ లో డిప్యుటేషన్ పై విధుల్లో డాక్టర్ రాజు ఉన్నట్టుగా చెబుతున్నారు.. అయితే, ఖాళీ సిరంజుల్లో నీరు నింపి ఇలా చేస్తున్నాడా..? లేక నిజమైన వ్యాక్సిన్ తెచ్చి వేస్తున్నాడా..? అని విచారిస్తున్నారు పోలీసులు. మొత్తంగా వ్యాక్సిన్ వ్యవహారం బెజవాడలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.