ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు. అయితే ఈ ఇంజెక్షన్ గురించి విజయవాడ ఆయుష్ హాస్పటిల్ ఎండి గోపాల కృష్ణ ఎన్టీవీతో మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయి. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది. ఈ ఇంజెక్షన్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలి..సీరియస్ కేసులకు వాడకూడదు. నిన్న ఇద్దరికి ఇంజక్షన్ ఇచ్చాము అరగంటలో కరోనా బాదితుడిని ఇంటికి పంపాను. ఇప్పుడు అతని పరిస్థితి చాలా బాగా మెరుగుపడింది. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన మూడు రోజుల్లో ఈ మందు తీసుకోవాలి. ఎవరికి పడితే వారికి ఈ మందు వాడకూడదు. ఇది ఒక్క డోస్ సరిపోతుంది కానీ కాస్ట్ 60 వేలు ఉంటుంది అని తెలిపారు.