అక్రమాలకు కేరాఫ్ అడ్రస్సుగా విజయవాడ మహేష్ ఆస్పత్రి మారిపోయింది. కరోనా పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తుంది మహేశ్ ఆస్పత్రి. అయితే ఈ అక్రమాలపై ఎన్టీవీకి సమాచారం అందింది. మహేష్ ఆస్పత్రి యాజమాన్యంపై బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతోన్నారు బాధితులు. రెండు లక్షల కడితేనే తప్ప చేర్చుకునేదే లేదంటూ స్పష్టం చేస్తుంది మహేష్ ఆస్పత్రి. డబ్బులు గుంజుతోన్నా.. ట్రీట్మెంట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోన్న మహేష్ ఆస్పత్రి యాజమాన్యం నర్సులతోనే ట్రీట్మెంట్ అందిస్తుంది అని బాధితులు తెలిపారు. ఆక్సిజన్ అందక…
ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగించారు. అయితే ఈ ఇంజెక్షన్ గురించి విజయవాడ ఆయుష్ హాస్పటిల్ ఎండి గోపాల కృష్ణ ఎన్టీవీతో మాట్లాడుతూ… కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయి. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా…
ఒకవైపు కరోనా మహమ్మారి దేశాన్ని భయపెడుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ నగరాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. నగరంలో ఈ కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 50కి పైగా ఈ కేసులు నమోదయ్యాయి. అటు ప్రైవేట్…
కృష్ణపట్నం ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మందు స్వీకరించిన వారి వివరాలను నెల్లూరు జిల్లా యంత్రాంగం పరిశోధనా కేంద్రాలకు అందించింది. తిరుపతి ఆయుర్వేద కళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివరాలు తెలియకపోవడంతో అదనంగా తిరుపతి కేంద్రానికి మరో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు. అయితే, మందు పంపిణీ సమయంలో…
విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ENT హాస్పిటల్ లో రోజులో 10 లోపు కేసులు వస్తున్నాయి. సింగరేణి హాస్పటిల్స్ లో రోజుకి 7,8 కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ హాస్పిటల్లో లిపోసామాల్ అంఫోటేరిసిన్ బీ ఇంజక్షన్ అందుబాటులో లేవు. దేశంలో కేవలం నాలుగు చోట్లే ఈ ఇంజక్షన్ తయారీ అవుతుంది. ఒక పెసెంట్ కు సర్జరీ చెయ్యాలంటే 104 వైల్స్ కావాల్సి ఉంటుంది. పెసెంట్ వైట్ ను బట్టి ఒక కేజీ వైట్…
బెజవాడలో వ్యాక్సిన్ అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి… ప్రభుత్వ డాక్టర్ వ్యాక్సిన్ అమ్ముతున్నట్టు గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేయాల్సిన వ్యాక్సిన్‌ను ఏకంగా అమ్మకానికి పెట్టి మరీ.. వ్యాక్సిన్ వేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.. వ్యాక్సిన్ కారులోనే వేస్తున్నట్టు సమాచారం అందటంతో జీ.కొండూరు ప్రభుత్వ డాక్టర్ ఎంఎస్ రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. అతని దగ్గర 5 కోవాగ్జిన్, 6 కోవిషీల్డ్ వ్యాక్సిన్ సీసాలు, సిరంజీలు స్వాధీనం చేసుకున్నారు.. ప్రస్తుతం కోవిడ్ హెల్ప్ లైన్ లో…
కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది.. ఆ రంగం.. ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది… ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉద్యోగులను, సిబ్బందిని కరోనా టెర్రర్ వణికిస్తోంది… ఇప్పటికే గన్నవరం విమానాశ్రయంలో వివిధ శాఖల్లో పనిచేసే 30 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది మహమ్మారి బారినపడగా… ముగ్గురు మృతిచెందారు… దీంతో.. గన్నవరం విమానాశ్రయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.. ఇక, గన్నవరం విమానాశ్రయం లో…