పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడి ఆస్పత్రులకు పరుగులు పెడుతుంటే.. అదే అవకాశంగా అందినకాడికి దండుకుంటున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు.. ఇలా, ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల దందా ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే పలు ఆస్పత్రులపై జరిమానా విధించిన ఏపీ ప్రభుత్వం.. ఇవాళ బెజవాడలోని నిమ్రా ఆసుపత్రిపై ఏకంగా రూ. 20 లక్షలు జరిమానా విధించింది.. ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయింపు జరపకపోవటం, పేషేంట్స్ నుంచి అధిక ఫీజులు వసూలు చేయడమే కారణం.. జేసీ శివశంకర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.. దీంతో.. భారీ జరిమానా విధించడంతో పాటు.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆంధ్రా ఈఎన్‌టీ ఆస్పత్రి, లిబర్టీ ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు అధికారులు.