సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ సరిపోక చాలా ఇబ్బంది పడ్డామని, మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం బాధేసింది విజయవాడ వీజీహెచ్ సూపరిండెంట్ తెలిపారు. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగానే సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పుడు 1000 లీటర్ల కెపాసిటీ కల్గిన మూడు కంటైనర్లు ఏర్పాటు చేసాం.. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాము. ఆక్సిజన్ పైపుల వెడల్పు పెంచి ఒకేసారి ఎక్కువ మందికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేసామన్నారు. వెంటిలేటర్స్ దగ్గర నుండి మందుల వరకు ముందస్తుగానే అప్రమత్తంగా ఉన్నాం.. థర్డ్ వెవ్ లో చిన్న పిల్లల కేసులు ఎక్కువ నమోదవుతాయి అని అంచనా వేస్తున్నాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్త చర్యలు పాటించాలి అని వీజీహెచ్ సూపరిండెంట్ తెలిపారు.