నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలవగానే భయంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారని ఎద్దేవా చేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఒక్కొక్కరు మిసైల్ లాంటి వారు.. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం.. మహిళ అంటే భాధ్యత.. భాధ్యత అంటే మహిళ అన్నారు.. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ.. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని…
(మార్చి 7న ‘ఒసేయ్ … రాములమ్మా!’ 25 ఏళ్ళు)అద్భుతాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయని కొన్ని చిత్రాలు నిరూపించాయి. సదరు చిత్రాలతోనే అదరహో అనిపించిన విజయశాంతి ‘లేడీ సూపర్ స్టార్’గా సంచలన విజయం సాధించిన చిత్రాలలో ‘ఒసేయ్ రాములమ్మా!’ ఓ అద్భుతం. అంతకు ముందు “ప్రతిఘటన, కర్తవ్యం” చిత్రాలలో తనదైన బాణీ పలికించిన విజయశాంతి ‘రాములమ్మ’గా చూపిన విశ్వరూపం మరపురానిది. మరువలేనిది. ఇక దర్శకరత్న దాసరి నారాయణ…
ఆ శివుడు ఊరుకోడు.. మూడో కన్ను తెరుస్తాడు.. సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తాడు అని ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున ఇస్తా అన్నాడు.. అందుకు రూ. 700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు..…
భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు విజయశాంతి.. ముఖ్యంగా అధికార పార్టీ, సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడంపై, కేంద్ర బడ్జెట్ తర్వాత సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంపై ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు రాములమ్మ.. తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుతో ఆయన పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం…
తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె..…
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని… కోటి ఎకరాల్లో సాగునీటి కోసమే కాళేశ్వరం తదితర సాగునీటి ప్రాజెక్టులున్నాయని… తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని గప్పాలు కొట్టిన కేసీఆర్ .. నేడు రైతుల పై రెండు…
హుజురాబాద్ అసెంబ్లీ బై ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి.. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని, కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయిన రాములమ్మ… హరీష్ రావు దళిత…
లక్ష రూపాయలు రుణమాఫీ చెయ్యకుండా నాన్చుతున్నరు. కేసీఆర్ హయాంలో పేదపిల్లలు చదువుకొనే 4 వేల స్కూల్స్ మూత బడ్డాయి అని విజయశాంతి అన్నారు. భూనిర్వాసితుల ఉసురుపోసుకున్నరు. డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు. బతుకమ్మ చేరెలు కట్టుకొనెలా ఉన్నాయా అని ప్రశ్నించారు. దొరగారు వస్తె రోడ్డుపక్కన మా అక్క చెల్లెళ్ళు దండం పెడుతూ నిలబడలా. ఇదా ఆడవారికి మీరు ఇచ్చే గౌరవం దొరగారు. 7 ఏళ్లుగా 4 లక్షల కోట్లు అప్పు చేశారు. ఒక్క పథకం అమలు కాదు.…
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు…
తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ భూముల అమ్మకంపై ఆర్థికమంత్రి హరీష్ రావు వాదన చాలా అసంబద్ధంగా ఉందని… గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంటి? అని నిలదీశారు. అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని…