సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా…
మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ పాట చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ పాటలో డాన్స్ చేస్తున్నాడని, ఇదో మాస్సీ క్రేజీ నంబర్ అని ఛార్మి తెలిపింది. విజయ్ దేవరకొండ చేయి మాత్రం కనిపించేలా ఓ కలర్ ఫుల్ క్లోజప్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇటీవల ఈ చిత్ర బృందం ‘రొమాంటిక్’ ప్రీ…
టాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అతడికి యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన సినిమాల్లో నాలుగైదు హిట్లే ఉన్నా అతడి నటనకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ప్రస్తుతం విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాల ద్వారా ఆనంద్ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్వరలో పుష్పక విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో తమ్ముడు ఆనంద్ కోసం…
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. అతడు వరంగల్ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తాడని ఎర్రబెల్లి వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చాడని, ఈరోజు కూడా వచ్చాడని ఎర్రబెల్లి…
దక్షిణాది బ్యూటీ రశ్మిక క్రేజ్ మామూలుగా లేదు. దీనికి నిదర్శనమే ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం. కన్నడ ‘కిరాక్ పార్టీ’తో పరిచయమైన రశ్మిక అతి తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న రశ్మిక బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇండియాలో అత్యంత ప్రభావవంతమైన నటీనటుల జాబితా రూపొందించింది ఫోర్బ్స్ సంస్థ. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది రశ్మిక. ఈ…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారి సన్నిధానంలో కన్పించారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవరకొండ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వారిని శాలువాలు కప్పి సత్కరించారు. విజయ్ దేవరకొండతో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. Read Also : “మా” ఎలక్షన్స్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “లైగర్”. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. ఈ విషయమై విజయ్ దేవరకొండ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా ఇబ్బందుల పాలైంది. కొన్ని రోజులు షూటింగ్ నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతోంది ?…
తెలంగాణాలో నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తెలంగాణాలో జరిగే ఈ ముఖ్యమైన పండగ సందర్భంగా మహిలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘బతుకమ్మ’ గురించి వరుస పోస్టులు చేశారు. “బతుకమ్మ శుభాకాంక్షలు. నా కుటుంబం ఇంట్లో ఈ పండగను జరుపుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అందమైన పువ్వుల పండగను పాటలు, డ్యాన్సులతో జరుపుకుంటారు. కవిత అక్క ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తూ,…
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు వేడుకలు ‘లైగర్’ సెట్లో యూనిట్ సభ్యలు మధ్య జరిగాయి. ఈ తరం దర్శకుల్లో వేగంగా, తక్కువ టైమ్ లో సినిమాలు తీస్తూ దూసుకుపోతున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ 28తో 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. గోవాలో షూటింగ్ సెట్లో పూరి తన బర్త్ డే బ్లాస్ట్ జరుపుకున్నాడు. విజయ్…