మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ పాట చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ పాటలో డాన్స్ చేస్తున్నాడని, ఇదో మాస్సీ క్రేజీ నంబర్ అని ఛార్మి తెలిపింది. విజయ్ దేవరకొండ చేయి మాత్రం కనిపించేలా ఓ కలర్ ఫుల్ క్లోజప్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇటీవల ఈ చిత్ర బృందం ‘రొమాంటిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ముంబైకి ఈ పాట చిత్రీకరణ కోసం వెళ్ళింది. అయితే ఈ పాటను ఎవరెవరి మీద చిత్రీకరిస్తున్నారు, కొరియో గ్రఫీ ఎవరు చేస్తున్నారు అనే విషయాలను మాత్రం ఛార్మి వెల్లడించలేదు. బాక్సింగ్ రంగ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న ‘లైగర్’ మూవీని దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.
Read Also : బిడ్డింగ్ నేపథ్యంపై ‘ఆహా’ సరికొత్త గేమ్ షో ‘సర్కార్’!