సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి శ్రీవారి సన్నిధానంలో కన్పించారు. ఈరోజు ఉదయం విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవరకొండ కుటుంబం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వారిని శాలువాలు కప్పి సత్కరించారు. విజయ్ దేవరకొండతో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు.
Read Also : “మా” ఎలక్షన్స్ : నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర వాగ్వివాదం
ప్రసుతం విజయ్ దేవరకొండ “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో కొన్ని సన్నివేశాల షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ మేరకు అమెరికా షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ కోసం వీసా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ వెల్లడించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.