సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన తాజా చిత్రం ‘పుష్పక విమానం’. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ విడుదల చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా ‘పుష్పక విమానం’ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. దాంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ఇటీవల విజయ్ దేవరకొండ ‘పుష్పక విమానం’ సినిమాకు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతోంది. ఈ సినిమాతో దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలు. ఈ సినిమాకు రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం అందిస్తున్నారు. గీతా సైనీ, సాన్వీ మేఘనా, సునీల్, నరేశ్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రమ్, వైవా హర్ష, అభిజిత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.