తెలంగాణాలో నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తెలంగాణాలో జరిగే ఈ ముఖ్యమైన పండగ సందర్భంగా మహిలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘బతుకమ్మ’ గురించి వరుస పోస్టులు చేశారు. “బతుకమ్మ శుభాకాంక్షలు. నా కుటుంబం ఇంట్లో ఈ పండగను జరుపుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అందమైన పువ్వుల పండగను పాటలు, డ్యాన్సులతో జరుపుకుంటారు. కవిత అక్క ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తూ, ఈ అందమైన స్థానిక పండుగ గురించి దేశానికి అవగాహన కల్పించడం ప్రశంసనీయం. ఈసారి ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్ వచ్చేసింది. ఏఆర్ రెహమాన్ స్వయంగా ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించగా, గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. మిట్టపల్లి సూరి సాహిత్యం అందించారు” అంటూ సాంగ్ ను షేర్ చేశారు దేవరకొండ.
Read Also : సామ్, చై విడాకులపై వెంకటేష్ కామెంట్
తెలంగాణాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ పండగను ‘తెలంగాణ జాగృతి’ పేరుతో మాజీ ఎంపీ కవిత ప్రమోట్ చేస్తున్నారు. ‘తెలంగాణ జాగృతి’ ద్వారా ‘బతుకమ్మ’ గురించి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఏడాదీ ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్ ను కూడా విడుదల చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా ‘బతుకమ్మ’ సాంగ్ ను రిలీజ్ చేశారు.
Happy Bathukamma 🌼
— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2021
My family is celebrating it at home, I send my best to women across the state bonding over and celebrating this beautiful festival of flowers, song and dance.https://t.co/3LfTwsHfG6