Home
Vijay Devarakonda
Vijay Devarakonda News
-
విదేశాల్లో ప్లాన్ చేసిన.. లోకల్ లోనే సెట్ వేశారు!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వేవ్ కారణంగా… -
అక్కడ ‘గీత’, ఇక్కడ ‘గోవింద్’… నంబర్ వన్ పొజీషన్ లో ‘డిజాయరబుల్ కామ్రేడ్స్’!
రశ్మిక అందం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలా? ఆమె కెరీర్ మొదలైనప్పటి నుంచీ పెద్ద సెన్సేషనే! శాండల్ వుడ్ లో రశ్మికని అప్పట్లో కర్ణాటక క్రష్ అనేవారు. ఇక ఇప్పుడు ‘మిషన్ మజ్నూ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తొలి చిత్రం విడుదలకి ముందే రశ్మికని నేషనల్ క్రష్ అంటోంది బీ-టౌన్ మీడియా. ఇక తెలుగులో ‘భీష్మ’ బ్యూటీ ‘సరిలేరు నాకెవ్వరూ’ అంటూ దూసుకుపోతోన్న సంగతి మనకు తెలిసిందే! తన చిలిపి వయ్యారంతో మాయ చేసే బెంగుళూరు… -
ఆ ఘనత విజయ్ దేవరకొండదే… వరుసగా మూడవసారి…!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సరికొత్త ఘనతను సాధించారు. ఇన్నేళ్ళుగా టాలీవుడ్ లో మరే ఇతర స్టార్ హీరోలు సాధించలేకపోయిన రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా మూడవసారి మోస్ట్ డిజైరబుల్ మాన్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది కూడా ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా 2020’గా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ప్రత్యేక రికార్డుపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ… -
ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ నయా రికార్డ్!
పాపులర్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సౌతిండియాలోనే ఓ నయా రికార్డ్ సృష్టించాడు. ఇక్కడ ఏ స్టార్ హీరో క్రాస్ చేయని 12 మిలియన్ ఫాలోవర్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో దక్కించుకున్నాడు. చిత్రం ఏమంటే… ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య అగ్రస్థానం దోబూచులాడుతోంది. ఒకసారి బన్నీది పై చేయి అవుతుంటే మరోసారి విజయ్ దేవరకొండ ది అవుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ 12 మిలియన్ ఫాలోవర్స్ ను పొందితే, 11.8… -
‘లైగర్’లో బీచ్ సాంగ్… మరోసారి పూరి సెంటిమెంట్
‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘సూపర్’, ‘దేశముదురు’, చిరుత’, ‘గోలీమార్’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘టెంపర్’, ‘హార్ట్ ఎటాక్’, ‘ఇస్మార్ట్ శంకర్’… పూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే బీచ్ సాంగ్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్, పటాయా, గోవా, మారిషస్ బీచ్ లలో తన సినిమాల్లో ఏదో ఒక సాంగ్ తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు. అసలు ఆయన సినిమా… -
‘లైగర్’ టీజర్ రిలీజ్ వాయిదా
విజయ్ దేవరకొండ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘లైగర్’ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు అయిన మే 9న ‘లైగర్’ టీజర్ విడుదల చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో టీజర్ రిలీజ్ కరెక్ట్ కాదని యూనిట్ భావించింది. అందుకే ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. పవర్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితులు కుదట… -
కరోనా లక్షణాలు, జాగ్రత్తలు చెబుతున్న విజయ్ దేవరకొండ
దేశంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. కరోనా వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా ముందుగానే జాగ్రత్త వహించడం మంచిది. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇదే చెప్పారు. కరోనాకు సంబంధించిన లక్షణాలు, జాగ్రత్తలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయ్ దేవరకొండ. “కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యింది. లక్షలాది మంది… -
పూరీకి విజయ్ దేవరకొండ అభిమానుల రిక్వెస్ట్…!
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యాండీ లాంగ్ టీమ్ ను రంగంలోకి దింపారు. ముంబైలోని… -
కొరటాల శివకు ‘నో’ చెప్పిన విజయ్ దేవరకొండ…?
దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ వేలో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన సినిమాలను రూపొందిస్తాడు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా కొరటాల శివకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘నో’ చెప్పాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విషయంలోకి వస్తే… డైరెక్టర్ కొరటాలకు యువసుధా ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేనితో మంచి అనుబంధం ఉంది. భవిష్యత్ లో కొరటాల శివ రూపొందించబోయే చిత్రాలను… -
మరోసారి విజయ్ దేవరకొండ, రశ్మిక జోడీ
విజయ్ దేవరకొండ, రశ్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా అలరించిన వీరిద్దరూ ఇప్పుడు మూడోసారి కలసి నటిస్తున్నారు. అయితే ఈసారి వీరిద్దరూ కలసి నటిస్తున్నది ఓ కమర్షియల్ యాడ్ లో. సంతూర్ సోప్ కి వీరిద్దరూ బ్రాండ్అంబాసిడర్స్ గా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రకటనను ఇటీవల ముంబైలో కోవిడ్ రూల్స్ కి అనుగుణంగా చిత్రీకరించారట. త్వరలో ఇది టీవీల్లో ప్రసారం కానుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా…
తాజావార్తలు
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!