Rape Case: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో రోడ్డు పక్కన అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగినట్లు సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనపడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతికి మద్యం తాగించి, అత్యాచారం చేసి, బెదిరించి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. వీడియో పోలీసుల దృష్టికి రావడంతో, బాధిత మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లో వెంటిలేషన్ పై సీతారాం ఏచూరి.. పరిస్థితి విషమం
పెళ్లి కోసం రప్పించి అత్యాచారం చేసి బెదిరించి పారిపోయాడు. మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కొత్వాలి సీఎస్పీ ఓంప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. ఉజ్జయిని లోని కోయిలా ఫటక్ మద్యం దుకాణం దగ్గర అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియో దొరికిందని తెలిపారు. ఈ వీడియోను గుర్తించి, మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి.. మహిళ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహిళకు మద్యం ఇచ్చి పెళ్లి చేసుకుందామని.. ఎప్పుడూ ఆమె వెంటే ఉంటానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే అత్యాచారం చేసిన అనంతరం యువకుడు బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని అన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.