చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి. చూసేందుకు సాధారణ దృశ్యాల మాదిరిగా ఉన్నప్పటికీ, ప్రముఖులు వాటిని ట్వీట్ చేయడం వలన వైరల్ అవుతుంటాయి. గుజరాత్‌లోని భావనగర్ రోడ్డును జింకలు వరసగా దాటుతున్న వీడియోను గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వేలావదర్ జాతీయ జింకల పార్కు నుంచి సుమారు 3 వేలకు పైగా జింకలు ఒకేసారి రోడ్డుమీదకు వచ్చాయి. అలా వచ్చిన జింకలు వరసగా రోడ్డును దాటుతూ చూపరులను ఆకట్టుకున్నాయి. గుజరాత్ ఇన్ఫర్మేషన్ ట్వీట్ చేసిన…
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్… ఇనుప నరాలు ఉన్న వంద మందిని ఇవ్వండి దేశాన్ని మార్చి చూపిస్తానని అన్నారు వివేకానందుడు. గుండె ధైర్యం, కండ బలం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అనుకున్నది సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కండబలం అంటే మగాళ్లకు ఉంటుందని అనుకుంటాం. కానీ, ఈ కాలంలో మగాళ్లకు ఆడవాళ్లు ఏ మాత్రం తీసిపోవడంలేదు. ప్రతి విషయంలో వారితో పోటీపడుతున్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన అలెసాండ్రా అల్విస్ అనే మహిళ ఓ పెద్ద…
పామును చూస్తే మనం ఆమడదూరం పరుగులు తీస్తాం. అందులో విషం ఉన్నదా లేదా అన్నది అనవసరం. పాము అంటే విషసర్పం అనే భావన మనందరిలో ఉన్నది. అయితే, కొందరు పాములను అవలీలగా పట్టుకొని వాటితో ఆడుకుంటుంటారు. చిన్నప్పటి నుంచి వాటి యెడల ఉన్న మక్కువే కారణం అని చెప్పొచ్చు. పాముల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో రెయిన్‌బో స్నేక్ చాలా ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఈ రెయిన్‌బో స్నేక్ చూడటానికి బ్లూకలర్‌లో కనిపిస్తుంది. లైట్ దానిపై పడే కొలదీ…
ట్విట్టర్ లో తరచూ వివాదాస్పద ట్వీట్స్ చేసే స్వరా భాస్కర్ మరోసారి కాంట్రవర్సీలో చిక్కింది. ఆమెతో పాటూ ట్విట్టర్ ఇండియాపై, మరికొందరిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కారణం… ఓ వీడియో. ‘ఘజియాబాద్ దాడి వీడియో’గా సొషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటోన్న క్లిప్పింగ్ లో ఓ ముస్లిమ్ వ్యక్తి తనపై దాడి జరిగిందన్నాడు. ‘జై శ్రీరామ్’ అననందుకు తనని కొట్టారనీ, బలవంతంగా గడ్డం కొరిగించారనీ ఆరోపించాడు. అయితే, ఆయన మాటల్ని వెనుకా ముందు ఆలోచించకుండా…
పులి వేట ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పులి టార్గెట్ చేస్తే ఖచ్చితంగా దానికి దొరికిపోతుంది. కానీ, ఓ చిన్నబాతుమాత్రం పులికి చుక్కలు చూపించింది. చిన్న కొలనులో ఉన్న బాతును అమాంతం మింగేసేందుకు కొలనులోకి దూకింది. కానీ, అందులో ఉన్న బాతు ఆ పులికి దొరకలేదు సరికదా పులిని ముప్పుతిప్పలు పెట్టింది. పులి దగ్గరకు రాగానే నీటిలో మునిగి మరోచోట తెలింది. అక్కడికి వస్తే ఆ బాతు అక్కడి నుంచి తప్పించుకొని మరలా వేరే చోట…
ఈనెల 8 వ తేదీన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు. కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నది. …