Kolkata: క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన ప్రొఫెసర్ కీలక నిర్ణయం.. ఏం చేసిందంటే..!
- క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన ప్రొఫెసర్ కీలక నిర్ణయం
- రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రొఫెసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. అయితే ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. అంతేకాకుండా వర్సిటీ నుంచి సెలవుపై పంపించారు. తాజాగా ప్రొఫెసర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Prashanth Karthi : ఆ పాత్ర అందుకే ఒప్పుకున్నా: ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి
Also Read
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT)లో అప్లైడ్ సైకాలజీ విభాగాధిపతి అయిన మహిళా ప్రొఫెసర్.. తన డిపార్ట్‌మెంట్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్‌తో తరగతి గదిలోనే హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వీడియో జనవరి 28న తెగ వైరల్ అయింది. ఇది పెద్ద దుమారం చెలరేగింది. అనంతరం ప్రొఫెసర్‌ను సెలవు పంపించారు. అంతేకాకుండా వర్సిటీ ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
అయితే వీడియో నెట్టింట పెద్ద దుమారం చెలరేగడంతో మహిళా ప్రొఫెసర్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. ఈ మేరకు వర్సిటీ కార్యాలయానికి ఇ-మెయిల్ పంపించారని తెలిపారు. మానసికంగా ఇబ్బందిపడడమే కాకుండా.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విశ్వవిద్యాలయంలో తన అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నట్లు ఆమె తెలిపినట్లు ఎంఏకేఏయూటీ రిజిస్ట్రార్ పార్థ ప్రతిమ్ లాహిరి పేర్కొన్నారు.
ఈ వీడియోను నాడియా జిల్లాలో ఎంఏకేఏయూటీలోని హరిన్‌ఘాటా క్యాంపస్ తరగదిలో చిత్రీకరించారు. అయితే డాక్యుమెంటేషన్ కోసం వీడియో చిత్రకరించినట్లుగా ప్రొఫెసర్ తెలిపారు. అయితే ఒక ప్రొఫెసర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి రచ్చ చేశారని ఆమె ఆరోపించారు. తన కెరీర్‌ను దెబ్బతీయడానికి.. తనను కించపరచడానికి ఉద్దేశపూర్వకంగా సహోద్యోగి లీక్ చేశారని ఆమె పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Nara Brahmani: చిన్నప్పుడు బాలయ్యని అపార్ధం చేసుకున్నాం.. నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!