ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022 మార్చ్ ఒకటో తేదీన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలనే రియల్టర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది.
Verdict to be out on Same Gender Marriage form Supreme Court: కొంతకాలంగా ఉత్కంఠ రేపుతోన్న స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైందని కాదని స్పష్టం చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా…
All eyes on Supreme Court verdict on Same Gender Marriage: నేడు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించనుంది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఏం…
అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను ఇతరులకు చూపించకుండా ప్రైవేట్‌గా చూడటం చట్ట ప్రకారం నేరం కాదని అది వ్యక్తిగత ఇష్టమని కేరళ హైకోర్టు పేర్కొంది. దానిని నేరంగా పరిగణిస్తే వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లిందని.. అతని వ్యక్తిగత ఎంపికలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది.
1995లో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) ప్రభునాథ్ సింగ్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
కేరళలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎమ్‌డిఆర్‌ఎఫ్) దుర్వినియోగం కేసును లోకాయుక్త పూర్తి స్థాయి బెంచ్ పరిశీలించనుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎమ్‌డిఆర్‌ఎఫ్) దుర్వినియోగం ఆరోపణల కేసులో తీర్పును పెద్ద బెంచ్‌కు రిఫర్ చేయాలనే దాని ద్విసభ్య బెంచ్ నిర్ణయించింది.
తెలంగాణలో క్యాడర్ అలాట్‌మెంట్ పై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెలవడనుంది. నేటితో 11 మంది ఆలిండియా సర్వీస్ అధికారుల భవిష్యత్ తేలనుంది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ పై కూడా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. అయితే, రమ్య కేసు తీర్పు పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని…