Supreme Court: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీల ధర్మాసనం ఇవ్వనుంది. అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్నారు. అనంతరం చంద్రబాబుపై సీఐడీ పలు కేసులు నమోదు చేసింది. అయితే తన కేసుల విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులన్నింటినీ క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలను అత్యున్నత న్యాయస్థానం వినింది. ఇంతలో చంద్రబాబుకు బెయిల్ లభించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణ పూర్తయినా.. ఇంతవరకు తీర్పు వెల్లడించలేదు. దీంతో.. నేడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
Read Also: Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్.. గురూజీ మిస్ అయ్యాడే?
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ వేశారు. 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడం కుదరదని పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10.30 గంటలకు సుప్రీం ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. దీంతో ఎన్నికల ముంగిట ఎటువంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండానే తనను అరెస్టు చేశారని.. రాజకీయ కక్షతోనే ఈ విధంగా వ్యవహరించారని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో జాతీయస్థాయిలో రాజకీయ కక్ష బాధితులు, అటు ప్రభుత్వాధినేతలు ఈ కేసు తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, స్కిల్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ పొందిన విషయం విదితమే.. ఆ తర్వాత చంద్రబాబుపై నమోదైన ఐఆర్ఆర్, లిక్కర్, ఇసుక కేసుల్లోనూ ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..