High Court of Kerala: అశ్లీల వీడియోలు చూడటం వ్యక్తిగత ఇష్టం.. కేరళ హైకోర్టు తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను ఇతరులకు చూపించకుండా ప్రైవేట్‌గా చూడటం చట్ట ప్రకారం నేరం కాదని అది వ్యక్తిగత ఇష్టమని కేరళ హైకోర్టు పేర్కొంది. దానిని నేరంగా పరిగణిస్తే వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లిందని.. అతని వ్యక్తిగత ఎంపికలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. దీంతో 33 ఏళ్ల యువకుడిపై కేసును హైకోర్టు కొట్టేసింది. 2016లో కేరళ పోలీసులు రోడ్డు పక్కన మొబైల్‌లో అశ్లీల వీడియో చూస్తున్న యువకుడిని పట్టుకుని అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్‌తోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న కోర్టు విచారణలను రద్దు చేయాలని నిందితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు.
Read Also: Abhinav Gomatam: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమెడియన్..
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఏమందంటే.. అశ్లీల కంటెంట్ శతాబ్దాలుగా ఆచరణలో ఉందని.. కొత్త డిజిటల్ ఇప్పటి యుగం పిల్లలకు దీన్ని మరింత అందుబాటులోకి తెచ్చిందని పేర్కొంది. ఒక వ్యక్తి తన ప్రైవేట్ సమయంలో ఇతరులకు చూపించకుండా అశ్లీల వీడియోలను చూస్తే నేరంగా పరిగణిస్తారా అని కోర్టు ప్రశ్నించింది. ఏ కోర్టు దీనిని నేరంగా ప్రకటించదని.. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత ఎంపిక అని పేర్కొంది. అంతేకాకుండా అలాంటి విషయంలో జోక్యం చేసుకోవడం అతని గోప్యతలో జోక్యం చేసుకోవడంతో సమానమని. నిందితుడు చూపించినట్లు ఎటువంటి ఆరోపణ లేదని బెంచ్ పేర్కొంది. మరోవైపు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 292 కింద ఎలాంటి నేరం జరగలేదని.. ఈ కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న అన్ని విచారణలను రద్దు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
Read Also: Off The Record: దరఖాస్తులకు దూరంగా బీజేపీ కీలక నేతలు.. పోటీ చేయడం ఇష్టం లేదా..?
ఇదిలా ఉంటే.. పిల్లలను సంతోషపెట్టడానికి ఇంటర్నెట్ ఉన్న మొబైల్ ఫోన్‌లను పిల్లలకు ఇవ్వవద్దని జస్టిస్ కున్హికృష్ణన్ తల్లిదండ్రులను హెచ్చరించారు. దీని వెనుక ఉన్న ప్రమాదం గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఆయన అన్నారు. పిల్లలు వారి పర్యవేక్షణలో సమాచార వీడియోలను చూడటానికి అనుమతించాలి.. కానీ మైనర్ పిల్లలకు వారిని సంతోషపెట్టడానికి మొబైల్ ఫోన్‌లను ఎప్పుడూ వారికి ఇవ్వకూడదని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మొబైల్స్‌లో అసభ్యకర వీడియోలు దొరుకుతున్నాయని జస్టిస్ కున్హికృష్ణన్ అన్నారు. మైనర్ పిల్లలు అసభ్యకరమైన వీడియోలు చూస్తే.. అది చాలా విపరీతమైన పరిణామాలను కలిగిస్తుందన్నారు. సెలవుల్లో పిల్లలు క్రికెట్, ఫుట్‌బాల్, ఇతర ఆటలకు ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని జస్టిస్ కోరారు.
తాజావార్తలు
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!