High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందన్న ధర్మాసనం వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని కోర్టుకు అధికారుల తరపున న్యాయవాదులు తెలిపారు. తెలంగాణలో క్యాడర్ అలాట్‌మెంట్‌పై 11 మంది ఆలిండియా సర్వీస్ అధికారులు, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌తో పాటు ఐఏఎస్ అధికారుల్లో వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఉన్నారు. 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపడాన్ని క్యాట్(సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ఆపేసిన విషయం తెలిసిందే. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
Read also: Cheddi Gang: అమ్మో మళ్లీ వచ్చారు.. మహబూబ్ నగర్ లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్
రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ 11 మంది కేంద్ర సర్వీసు అధికారులకు ఏపీ కేడర్‌ను ఖరారు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారంతా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తెలంగాణలో పనిచేయాలని క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కేసు 27కు వాయిదా పడింది. ఇటీవల హైకోర్టు సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌గా ప్రకటించి, గతంలో క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఏపీకి బదిలీ చేసింది. ఈనేపథ్యంలో ఈరోజు ఎలాంటి తీర్పు వెలువరించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read also: High Court: ఆల్ ఇండియా సర్వీసు అధికారుల కేటాయింపు.. విచారణ ఈనెల 27 కు వాయిదా
ముఖ్యంగా తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ఇక్కడే ఉంటారా? లేక ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ 11 మందిలో 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండగా.. వాణీ ప్రసాద్, వాకాటి అరుణ, రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఉన్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారించిన హైకోర్టు సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. అందుకే ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు 11 మంది ఐఏఎస్ అధికారుల వంతు వచ్చింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.
Manikrao Thakur: నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో థాక్రే పర్యటన