ఏపీతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. ఈ కేసులో హంతకుడైన శశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.. శశికృష్ణను చనిపోయేంత వరకు ఉరి తీయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ కేసులో 10 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేశారు.. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నిర్ధారణ చేశారు, దిశ కింద కొత్త ల్యాబులు,…
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసుల్లో ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పు వెల్లడించనుంది.. కాగా, పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసు నమోదు చేశారు.. ఇక, ఈ కేసులో నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది.. ఈ కేసులో 30 మందికిపైగా సాక్షులను విచారించింది కోర్టు.. అదే విధంగా ఆ…
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. 3 నెలల్లో ప్లాన్‌ను పూర్తిచేయాలని హైకోర్టు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి…
సినీనటి సమంత కేస్ లో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు ప్రకటించనుంది కూకట్ పల్లి కోర్టు. తన వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రసారం చేసి తనపరువుకు భంగం కలిగించారని నటి సమంత కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సీఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణతో పాటు, తనకు సంబంధించి ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌లో వున్న వీడియో లింక్…
కూకట్ పల్లి కోర్టులో సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఈరోజు విచారణ చేపట్టారు. సమంత ఇంకా విడాకులు తీసుకోలేదని, ఆ లోగానే ఆమెపై దుష్ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలింగేలా ప్రవర్తించారని, సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని వార్తలు రాశారని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని సమంత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పు జరిగిందని భావిస్తే పరువునష్టం…
కేరళలోని కొల్లంలో దివ్యాంగురాలైన ఓ వివాహిత పాటు కాటుతో మరణించింది.. అయితే, అదంతా ఓ ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ కావడం అంతా కంగుతినే విషయం.. ఈ కేసును సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సజీవ పాము, ఓ బొమ్మ దాని చేతిని ఉపయోగించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడం సంచలంగా మారింది.. ఈ తరహాలో పోలీసులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. దీంతో.. ఇది దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది.. అయితే, ఈ కేసులో మృతురాలి…
కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనాతో మరణించినట్లు దృవీకరణ పత్రం లేకున్నాకూడా పరిహారం అందించాలని, ఈ పరిహారం కోసం ధరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా పరిహారం అందించాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జాతీయ విపత్తున నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన విధంగా రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఏ రాష్ట్రం నిరాకరించరాదని,…