విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బ్లాక్‌బస్టర్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ ఫన్-ఫిల్డ్ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న వేసవికి థియేటర్లలో నవ్వుల అల్లర్లు సృష్టించడానికి సమ్మర్ సోగ్గాళ్లుగా ‘F3’తో రాబోతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. తాజాగా సినిమా మొదటి సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి పాట “లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ” ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
Read Also : కొత్త ఇంట్లోకి రష్మిక… ఎప్పుడు మారుతోందంటే?
“F3” కథ డబ్బు చుట్టూ తిరగబోతుందన్న సంగతి తెలిసిందే. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఒక్క పాట మాత్రమే పెండింగ్‌లో ఉంది. డబుల్ బ్లాక్ బస్టర్ ‘ఎఫ్2’కి ఫ్రాంచైజీగా వస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. వెంకటేష్ సరసన తమన్నా భాటియా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తుండగా, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నవ్వించే పాత్రలో కనిపించనున్నారు. మరింత గ్లామర్ జోడించడానికి సోనాల్ చౌహాన్ ను మూడవ నటిగా ఎంపిక చేయగా, సునీల్ వినోదభరితమైన పాత్రలో నటిస్తున్నారు.