ఈ వేసవిలో కమల్ హాసన్ బాక్సాఫీస్ రేసులో చేరబోతున్నాడు. ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ 2’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3’ వంటి పెద్ద సినిమాలు ఇప్పటికే ఏప్రిల్, మేలో విడుదలకు డేట్‌లను లాక్ చేశాయి. తాజాగా ‘విక్రమ్’ ఈ జాబితాలో చేరుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కార్తీ ‘ఖైదీ’, విజయ్ ‘మాస్టర్’ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కమల్ హాసన్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మార్చి 14న సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
Read Also : Ram Charan and Upasana vacation : రెండేళ్ల తరువాత… పిక్ వైరల్
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 26న విడుదల చేసేందుకు కమల్ హాసన్ ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘F3’, అడివి శేష్ పాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’ మే 27న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈ మూడు సినిమాలు దాదాపు ఒకే తేదికి రానున్నాయన్నమాట. ఇప్పుడు వస్తున్న వార్తలు గనుక నిజమైతే వెంకటేష్, అడివి శేష్ కు కమల్ హాసన్ గట్టి పోటీ ఇవ్వనున్నాడు.