నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ సర్ప్రైజ్ ట్రీట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఈరోజు ఉదయం ఆయన నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్3” నుంచి వెంకికీ సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. తాజాగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నుండి ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఇందులో వెంకీ మామ ఓల్డ్…
ఈరోజు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజును అభిమానులు సోషల్ మీడియాలో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ “ఎఫ్ 3” మేకర్స్ సరికొత్త వీడియోను విడుదల చేశారు. వెంకటేష్ తన చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్ ముందు విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో రాజులా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ సంస్కృతిని కన్విన్సింగ్గా ప్రదర్శించారు.…
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు చిత్రసీమలో వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ విజయయాత్ర చేసిన స్టార్ హీరో వెంకటేశ్ అనే చెప్పాలి… తొలి నుంచీ వరైటీ రోల్స్ లో అలరిస్తూ సక్సెస్ రూటులో సాగుతున్నారాయన… కొన్నిసార్లు ట్రాక్ తప్పినా, మళ్ళీ వైవిధ్యంతోనే విజయపథాన్ని చేరుకుంటున్నారు… కాలానికి అనుగుణంగా సాగుతున్నారు వెంకటేశ్… నవతరం స్టార్స్ తోనూ జోడీ కడుతూ వినోదం పండిస్తున్నారు… మరోవైపు తన వయసుకు తగ్గ పాత్రలతో ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు… ఆ తీరున సాగుతున్న…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారుతున్న సంగతి తెల్సిందే.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించిన అమ్మడు ఎట్టకేలకు వివాహంతో అతడి చెంతకు చేరనుంది. వీరి పెళ్లి అతికొద్ది బంధువులు.. ఇంకొంతమంది ప్రముఖల మధ్య ఈ నెలలో జరగనుంది. ఇప్పటికే రాజస్థాన్ లో క్యాట్- విక్కీల పెళ్ళికి అంతా సిద్ధమవుతున్నాయి. ఇక తాజగా ఈ జంట పెళ్లి పత్రికలను పంచే పనిలో పడ్డారంట .. చాలా ముఖ్యమైన గెస్టులను మాత్రమే కత్రినా పిలవనున్నదట..…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు ఇటీవల సోషల్ మీడియా కోడై కూసింది. ఇదే విషయాన్ని ఇటీవల తన సినిమా ‘అంతిమ్’ ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కన్ ఫామ్ చేశాడు సల్మాన్. దీని ప్రకారం మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ గా చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ల ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నాడు సల్మాన్. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర ఇది. తెలుగు ప్రేక్షకులకు మరో ముఖ్యమైన…
ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, అభిమానులు చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కంటతడి పెడుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. తెలుగు ఇండస్ట్రీలో సిరివెన్నెల గ్రేటెస్ట్ రైటర్… ఆయన చాలా మంచి వ్యక్తి… బొబ్బిలి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే నుంచి మొన్న నారప్ప వరకు కలిసి పని చేశాము. ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవాడిని. ఈరోజు ఆయన లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. సిరివెన్నెల…
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల ఇక లేరన్న విషయాన్నీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కిమ్స్ నుంచి నేరుగా ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివదేహాన్ని ఉంచారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు కడసారిగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు రాజమౌళి కుటుంబ సమేతంగా ఆయన పార్థివదేశాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఫిల్మ్ ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చూసి సీనియర్…
చూస్తుండగానే ఈ యేడాది చివరి నెల డిసెంబర్ లోకి వచ్చేస్తున్నాం. అయితే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ నెలలోనే టాలీవుడ్ లో అత్యధికంగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే సగటున రోజుకు ఒక సినిమా విడుదలైంది. అందులో స్ట్రయిట్, డైరెక్ట్ ఓటీటీ, డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభమే సూర్య నటించిన అనువాద చిత్రం ‘జై భీమ్’తో మొదలైంది. గిరిజనుల గోడుకు అర్థం పట్టే ఈ సినిమాలో మానవహక్కుల లాయర్ గా సూర్య నటించాడు.…
మలయాళంలో 2013లో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ను తెలుగులో అదే పేరుతో వెంకటేశ్ రీమేక్ చేశారు. 2014లో విడుదలైన ఆ సినిమా ఇక్కడా చక్కని విజయాన్ని అందుకుంది. మాతృకలో మోహన్ లాల్ భార్యగా నటించిన మీనా, తెలుగు రీమేక్ లో వెంకీకి భార్యగా నటించారు. అదే కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘దృశ్యం’ సీక్వెల్ ఈ యేడాది ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చింది. ఇప్పుడు ఆ సీక్వెల్ నూ తెలుగులో వెంకటేశ్ రీమేక్ చేశారు. అదిప్పుడు…
‘పటాస్’ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి విజయయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ఒక చిత్రాన్ని మించిన విజయాన్ని మరో చిత్రంతో అందుకుంటూ ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ దూసుకుపోతున్నాడు. ఈ ఆరేళ్ళలో అనిల్ దర్శకత్వం వహించింది కేవలం ఐదు చిత్రాలే అయినా, తెలుగు సినిమా రంగంలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల విజయం…