సినిమా ఇండస్ట్రీలో ఒకరు తిరస్కరించిన ఆఫర్ మరొకరి దగ్గరకు వెళ్లడం అన్నది సాధారణమే. తాజాగా వెంకీమామ రిజెక్ట్ చేసిన కథ చైకి నచ్చిందనే టాక్ నడుస్తోంది. తరుణ్ భాస్కర్ తన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ తోనే కాకుండా తన నటనతో కూడా తెలుగు వారి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకుముందు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ దగ్గుబాటికి స్క్రిప్ట్ చెప్పాడని, కానీ ఈ సీనియర్ హీరో ఆ కథను తిరస్కరించాడని వినిపించింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే, తరుణ్ భాస్కర్ అదే స్క్రిప్ట్‌ను నాగ చైతన్యకు వివరించాడట. అయితే వెంకీ మామ తిరస్కరించిన కథనే నాగ చైతన్య ఓకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also : తగ్గేదే లే బన్నీ… 10 రోజుల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ !
ఇదిలా ఉంటే, నాగ చైతన్య ప్రస్తుతం BVS రవి రచన, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థాంక్యూ’ సినిమాతో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు రష్యాలో జరుగుతోంది. మరోవైపు చై… అమీర్ ఖాన్‌తో పాటు ‘లాల్ సింగ్ చద్దా’లో కూడా కనిపించబోతున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి.