మల్లాది విష్ణు వర్గం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ పాదయాత్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 25న తన వర్గంతో మల్లాది విష్ణు సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో ఏం చేయాలనే దానిపై విష్ణు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు పార్ట కేడర్ చెబుతుంది.
వైసీపీ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ల పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బెజవాడ సెంట్రల్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలో బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది.
వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎం గా ఉండనున్నారు.. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం పదవులు అందని వారికి జగన్ మళ్లీ న్యాయం చేస్తారు.
రేపటి నుండి ఏపీకి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆర్దికంగా ఏపీ బలోపేతం అవడానికి కారణం సీఎం జగన్.. జగన్ సీఎం కాకముందు తలసరి ఆదాయంలో ఏపి చాలా వెనుకబడి ఉంది.. వ్యవసాయ, పరిశ్రమ రంగంలో జగన్ హయాంలో ఏపీ చాలా ముందజలో ఉందన్నారు.
చంద్రబాబు సీఎం, ఎంపీ నాని, పారిపోయిన జలీల్ ఖాన్, దద్దమ్మ దేవినేని ఉమ ఉండి కూడా వన్ ఔన్ అభివృద్ధి కాలేదు అంటూ వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ ఆహ్వానించదగినది.. అభివృద్ధి చేసిన సీఎం జగన్ ను గుర్తు పెట్టుకోవాలి అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
లోకేశ్ చేపట్టిన యువగళం ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. విజయవాడ నగరం గురించే మాట్లాడలేవని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తున్న యాత్రకు ప్రజాదరణ లభించడం లేదని.. అందువల్లనే టీడీపీ ఎంపీలు లోకేష్ యాత్రను బహిష్కరించారని వెల్లంపల్లి తెలిపారు.
మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ఏమీ పీకలేరని విమర్శించారు. పవన్ కల్యాణ్కు సత్తా ఉంటే సింగిల్గా రావాలి అని వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ చేశారు.