టిడిపి అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని..చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు నాయుడి, అచ్చెం నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాలడెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని… సంగం డైరీ ఎవడబ్బ సొత్తు…
ఇవాళ విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ప్రచారంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. బీజేపీ, జనసేన, సీపీఐ అందరూ చంద్రబాబు దొంగల ముఠా అని… బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ మొదటి సారి జీవితంలో నిజం మాట్లాడారని నిప్పులు చెరిగారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికే చోటు ఉంటుందని వాస్తవం చెప్పారని.. కానీ సాయంత్రానికి ప్యాకేజీ తీసుకుని గళం మార్చారని పేర్కొన్నారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టాలనుకుంటున్నారా? వాళ్ళు…