వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 96లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని, 30 ఏళ్లుగా ప్రాజెక్టు నిర్మాణం జరగడంపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రతి 15 రోజులకి ఒక సారి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని, 2026 కల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా…
Cyclone Montha: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. భారీ నష్టాన్ని మిగిల్చింది.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. తుఫాన్ అనంతర పరిస్థితులపై ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, సీఈలు, ఎస్ఈ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాం మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతంలో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరినట్టు తెలిపారు.. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి…
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు..
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014-19 మధ్య టీడీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్ల రూపాయాలు కేటాయించి 96 శాతం ఖర్చు చేశాం.. కానీ, గత ఐదేళ్లలో జగన్ పాలనలో 3,518 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం 170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు..
వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు.. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు..
దశాబ్దాల కలలు కన్న వెలిగొండ ప్రాజెక్టు సాకారం చేసుకున్నాం.. ప్రాజెక్టు ప్రారంభించే అవకాశాన్ని దేవుడు నాకివ్వటం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సీఎం వైఎస్ జగన్. వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు వైఎస్సార్ శంఖుస్థాపన చేసి పనులు మొదలు పెడితే.. ఇవాళ ఆయన కొడుకుగా రెండు టన్నెల్స్ ను ప్రారంభించటం దేవుడి రాసిన స్క్రిప్ట్ అని భావిస్తున్నాను అన్నారు..
దశాబ్దాల కల నెరవేరుస్తూ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన.. ట్విన్ కెనాల్స్ ప్రారంభోత్సవ పైలాన్ ను ఆవిష్కరించారు. వెలిగొండ ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును పరిశీలించి.. జరగాల్సిన పనులపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.