వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంపై మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. త్వరలో కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి కష్టాలు తీరనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ కల సాకారం చేస్తూ.. రెండో టన్నెల్ పూర్తి చేసింది.. రెండో సొరంగం తవ్వకం పనులు ఇవాళ్టితో ముగిసాయి.. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు ఈ రోజు పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పరస్పరం ఫిర్యాదులు, లేఖల పర్వం కొనసాగగా.. గతంలో తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని ఇటీవల కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అనుమతి లేకుండా…
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో.. ఇటు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు.. మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.. ఇప్పుడు హస్తినకు కూడా వెళ్లారు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసింది ప్రకాశం, నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు, మాజీ శాసనసభ్యలు, నాయకుల బృందం.. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. వెలిగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరిన…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖరాశారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు.. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో పునర్ సమీక్ష చేయాలని లేఖలో కోరారు.. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని లేఖలో ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలు.. కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు.. తెలంగాణ సర్కార్ రాసిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరారు.. అయితే, గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు పేరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. 2014…