(మే 16తో ‘వీరకంకణం’కు 65 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్ కథానాయకునిగా తెరకెక్కిన జానపద చిత్రం ‘వీరకంకణం’ ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించింది. 1950లో ఎమ్.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘మంత్రి కుమారి’ ఆధారంగా ఈ ‘వీరకంకణం’ తెరకెక్కింది. ఆ సినిమాను నిర్మించిన మోడరన్ థియేటర్స్ సంస్థ ‘వీరకంకణం’ను తెలుగులోనూ నిర్మించింది. 1957 మే 16న ‘వీరకంకణం’ చిత్రం విడుదలయింది. ‘వీరకంకణం’ కథ ఏమిటంటే- ఓ దేశానికి రాజైన వెంగళరాయ దేవ అమాయకుడు. తమ రాజగురువు…