Koti Deepotsavam 2025: రచన టెలివిజన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగిస్తారు.
శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. "దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు..
'ఆదియోగి'కి సంబంధించిన ప్రోమోను ఈ రోజు విడుదల చేసింది వనిత టీవీ.. భక్తి గీతాలకు పెట్టింది పేరైన సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు.. "నీ పాదధూళి రాలిన విభూదిని.. తనువెల్ల పూసుకున్న నీకు దాసోహమే.. దింగబర జగంబులో నీ సాటి ఎవరు రా? అహంబును వీడనాడినానురా నీ సేవలు.. ఆది యోగి.. అరుణాచల శివ.. ఆదియోగి.. గౌరీ శంకర ఆదియోగి..' అంటూ సాగుతోన్న 'ఆదియోగి' సాంగ్ ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. పూర్తి సాంగ్ ఎప్పుడు విడుదల…
ఎవరూ చేయని సాహసాలు నేను చేస్తాను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీలో టాలెంట్ ఉండి సరైన గుర్తింపు లేదు అని భాదపడుతున్నారా...? మీ టాలెంట్ ని అందరికీ చూపించే అవకాశం కల్పిస్తుంది మీ వనిత టీవీ.. మా టాలెంట్‌ను ఎలా చూపించాలి అనుకుంటున్నారా..? ఆలస్యం ఎందుకు వెంటనే మీరు ఫోన్ నంబర్ 9010234007ను సంప్రదించండి..
Srikalahasti Palakova Food Vlog: ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అంటే టక్కున గుర్తొచ్చేది అక్కడి శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం. కానీ అక్కడికి వెళ్లిన వారికి ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం మరొకటి ఉంది. అదేంటి అని అనుకుంటున్నారా? అదే పాలకోవా. అవును శ్రీకాళహస్తి కోవా రుచి చూసిన వారెవరు దాన్ని మరచిపోలేరు. శ్రీకాళహస్తి పాలకోవా ఇప్పటిది కాదండోయ్ ఏకంగా దాదాపు 7 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. పరిసర ప్రాంతాల్లోని పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో ఈ…
Star Vanitha Program Starts From Today on Vanitha TV: ‘వనిత’ టీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటైన తొలి తెలుగు చానెల్ వనిత టీవీ. పొలిటికల్ న్యూస్, ఎంటైర్మెనెంట్, ఈవెంట్స్, వంటలు, హెల్త్ ప్రోగ్రామ్స్, కొటిదీపోత్సవం ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తున్న వనిత టీవీ.. మరో సరికొత్త ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వస్తోంది. ఆ ప్రోగ్రామే ‘స్టార్ వనిత’ (Star Vanitha Program). మహిళల కోసమే…