Koti Deepotsavam 2025: రచన టెలివిజన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగిస్తారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపాల పండగ.. 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతోంది. కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభమే కోటి దీపోత్సవం. ఈ మహాక్రతువుకు గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరుకానున్నారు.. నేత్రపర్వంగా సాగే మహా ఆధ్యాత్మిక క్రతువుకు ఎన్టీఆర్ స్టేడియం ముస్తాబైంది. ప్రతి రోజు సాయంత్రం 5.30కు దీపాల పండగ ఆరంభం కానుంది. నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియం కైలాసాన్ని తలపిస్తుంది. కార్తీక మాసంలో కోటి దివ్వెల పండుగ.. నేటి తరానికి సనాతన సంస్కృతి పరిచయం చేస్తోంది.. సిటీలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.
READ MORE: POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష
తొలి రోజు(శనివారం- ప్రబోధిని ఏకాదశి) విశేష కార్యక్రమాలు..
బ్రహ్మశ్రీడా॥ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రవచనామృతం జరగనుంది. అనంతరం.. వేదికపై పూజ సహస్రలింగానికిశతఅష్టోత్తరశంఖాభిషేకం, కోటిమల్లెలఅర్చన కన్నుల పండువగా నిర్వహిస్తారు. భక్తులచే శివలింగాలకు కోటిమల్లెల అర్చన ఉంటుంది. కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణం, హంస వాహన సేవ అంగరంగా వైభవంగా కొనసాగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఆధ్యాత్మిక క్రతువులో పాల్గొని తరించండి..!