Shivaratri New Song 2025: శివరాత్రి వచ్చేసింది.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో శివరాత్రి బ్రహ్మోత్సవాలు, శివరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. శివరాత్రిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిపోయింది.. ఇక, శివరాత్రి 2025ను పురస్కరించుకుని ప్రత్యేక పాటను ఆవిష్కరించింది వనిత టీవీ.. “దేవ దేవ శంకర దేవ శంభో శంకరా.. దేవులాడినేడదొరకవా..! ఆది ఆది శంకరా యాడతిరుగుతున్నవు.. జాడతెల్వకున్నవేందిరా..!! నిప్పుగాని నిప్పువు.. నీడగాని నీడవు.. మూఠలేని ముల్లెవు ఏ మిచ్చినా ఒల్లవు..!!! అన్ని ఉండి ఏమీ లేని అదిభిక్షువున్నవు..!!! అంటూ ప్రముఖ రచయిత, సింగర్ గోరేటి వెంకన్న రాయడంతో పాటు తన గొంతు సవరించారు.. ఇక, “జంగ జంగ జంగమ్మ.. జగమునేలె లింగమ్మ.. ఎల్లజనుల గుండెలో తరంగమా..” అంటూ సాగే పాటను ప్రముఖ సింగర్ రేవంత్ అందుకున్నారు.. శివరాత్రిని పురస్కరించుకుని వనిత టీవీ విడుదల చేసిన ఈ ప్రత్యేక గీతం.. ఆది దేవుని భక్తులను ఆకట్టుకుంటుంది.. యూ ట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది..
Read Also: India Masters: మెరిసిన సచిన్, యువరాజ్.. ఇంగ్లాండ్‌పై భారత్ విజయం!
శివరాత్రి సందర్భంగా.. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకమైన పాటలు వచ్చాయి.. శివరాత్రి 2025 పురస్కరించుకుని వనిత టీవీ విడుదల చేసిన ప్రత్యేక గీతాన్ని చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..