Priyanka Gandhi: లోక్‌సభలో వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలోని ప్రతి అణువులో వందేమాతరం ఉందని, మరి దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గురించి చర్చిస్తోందని ఆమె ఆరోపించారు. వాస్తవానికి వందేమాతరం ప్రస్తావన వచ్చినప్పుడు, మనకు చరిత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. READ ALSO:…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘‘బలవంతపు ఆదేశాలు’’గా అభివర్ణించింది. జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది సంగీత-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం…