Jammu Kashmir: స్కూల్స్‌లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి.. ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత..
- స్కూల్స్‌లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి..
- నిర్ణయంపై జమ్మూ కాశ్మీర్ ముస్లిం సంఘాల అభ్యంతరం..
- వందేమాతరం పాడటం ఇస్లాంకు వ్యతిరేకమని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘‘బలవంతపు ఆదేశాలు’’గా అభివర్ణించింది. జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది సంగీత-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. ఇది అన్యాయమని, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నాయి.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU)కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ ఈ ఆర్డర్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ముస్లిం విద్యార్థులు, సంస్థలను వారి మత సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించేలా బలవంతం చేస్తుందని అన్నారు. ముస్లింలకు వందేమాతరం పాడటం అనుమతించబడదు అని ఎంఎంయూ చెప్పింది. “వందేమాతరం పాడటం లేదా పఠించడం ఇస్లాంకు విరుద్ధం, ఎందుకంటే అందులో అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం (తౌహీద్) పై ప్రాథమిక ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధంగా భక్తి వ్యక్తీకరణలు ఉన్నాయి” అని మీర్వైజ్ కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది.
కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలు అక్టోబర్ 31- నవంబర్ 7, 2025 మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరింది, అక్కడ విద్యార్థులు,ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని పాడాలని చెప్పింది. ఈ ఆదేశాలు నిజమైన ఐక్యత, వైవిధ్యం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం కన్నా సాంస్కృతిక వేడుక ముసుగులో ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం అని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏ విద్యార్థి లేదా సంస్థ వారి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని బలవంతం చేయకుండా చూసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలను ఎంఎంయూ కోరింది
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!