ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్‌ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.
వందే భారత్ రైలుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్ పైకప్పు నుంచి వర్షపునీరు ధారలా కారిపోతుంది. దీంతో ప్రయాణికులు సీట్లో కూర్చోలేని దుస్థితి ఏర్పడింది. భారీగా నగదు చెల్లించి టికెట్ తీసుకుని.. సీట్లో కూర్చునే అవకాశం లేకుండా పోయింది.
పంజాబ్‌లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి.
Vande Bharat Train: స్నేహితులు లేదా బంధువులను డ్రాప్ చేయడానికి తరచుగా రైల్వే స్టేషన్లకు వెళ్తాము. చాలా సార్లు వారిని రైలు లోపలికి తీసుకువస్తాము. కదులుతున్న రైలు నుండి ప్రజలు కిందకు దిగడం తరచుగా చూసే ఉంటాం.
వరంగల్ మీదుగా మరో వందేభారత్ ప్రారంభం కానుంది. వరంగల్ మీదుగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం నుంచి నడవనుంది. దీనిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాఖపట్నంకు వందే భారత్ ట్రైన్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాగా.. ఇది తెలంగాణ నుండి నాల్గవ…
నేడు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును(నం.20834) అధికారులు రద్దు చేశారు. సాంకేతిక లోపం వల్ల ఆ రైలు రద్దు చేయబడింది. ఇందులోని ప్రయాణీకులందరికీ పూర్తి ఛార్జీ వాపసు చేయబడుతుందని అధికారులు ప్రకటించారు.
Vande Bharat Express : డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఆనంద్ విహార్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చెడిపోయిన ఆహారం అందించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Ashwini Vaishnaw: రాబోయే కొన్ని ఏళ్లలో భారతదేశంలో కనీసం 1000 కొత్త తరం ‘అమృత్ భారత్ ట్రైన్’లను తయారు చేస్తో్ందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి పనులు జరుగుతున్నాయని శనివారం తెలిపారు. వందేభారత్ రైళ్ల ఎగుమతిపై ఇప్పటికే పనులు ప్రారంభించామని, వచ్చే ఐదేళ్లలో తొలి ఎగుమతి జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోడీ హయాంలో రైల్వేల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన…